mystic shiva
life is a mystery. time is eternal, so is life. sunrise at one place is sunset somewhere. continuity is there in the universal phenomenon but the eyes are blind in the darkness of ignorance. knowledge of unity in diversity and acceptance of oneness of the universe leads to peace and bliss. beautiful is the world. the eyes should see it. caterpillar is the preform of beautiful butterfly. the result of patience and perseverance is achievement and happiness.
Wednesday, May 15, 2024
Thursday, February 15, 2024
సమ్మక్క జాతర 2024
గద్దెలవద్దకు ప్రవేశ ద్వారము (2022) |
గట్టమ్మ ఆలయం వద్ద సమ్మక్క గద్దె సమ్మక్కను దర్శించుకునేముందు ములుగు జిల్లా మొదట్లో వున్న గట్టమ్మను దర్శించుకుంటరు (2022) |
అమ్మవారిని దర్శించుకోవడానికి వడిబియ్యముతో వస్తున్న మహిళలు(2022) |
జాతర విహంగ వీక్షణము (2022) |
తెలంగాణలో అతి పెద్ద జాతర, తెలంగాణ కుంభమేళము అని పిలువబడే ఈ జాతరలో రాష్ట్రమునుండే కాక చుట్టుపక్కల రాష్ట్రాలనుండి కూడా జనాలు వస్తరు. ఈ జాతర ఆదివాసుల జాతరగా చెప్పబడుతున్నా, ఆదివాసులే కాక అన్ని కులాల వాళ్ళు కూడా వస్తారు
మేడారములో సమ్మక్క గద్దెల వద్ద జనాలు జాతరకు 20 రోజులముందు ఇది పరిస్తితి |
చిన్నపిల్లల పేరుతో ఎత్తు బంగారము ఇస్తామని మొక్కుకుంటే ఇట్ల ఓ చిన్న ముద్ద
పిల్లల తలపై పెట్టి తల్లో, తండ్రో పట్టుకొస్తారు
సామాన్యంగా మొక్కు చెల్లించడానికి బంగారాన్ని తలపై పెట్టుకొనే వస్తరు ఇట్ల పెద్ద పెద్ద బంగారం (బెల్లం) ముద్దలు గద్దెల మీదికి విసిరినప్పుడు కొందరికి దెబ్బలు తగలటము మామూలే
ఒకప్పుడు జనాలు కేవలం జాతర సమయములోనే వచ్చేవారు. కాని కొన్ని ఏండ్ల నుండి జాతరకు నెల-రెన్నెలు ముందే వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర సమయములో జనాలు లక్షల్లో వస్తరు. అప్పుడు గద్దెల
దగ్గరకు పోవటము చాలా కష్టము. అయిన కొన్ని లక్షలమంది
జాతర టైములోనే వచ్చి అమ్మవార్లు ఉన్నపుడే భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటరు.
ఎదురు కోళ్ళు సమర్పించటము జీవహింస లేకుండా ఇట్ల కోడిని తీసుకొని గాలిలోకి ఎగిరెస్తరు కోడికాలుకు ఒక తాడు కట్టి పెట్టుకుంటరు. దీనికి ఆమె పది రూపాయలు తీసుకుంటుంది. మరి జాతర టైములో ఎంత అంటుందో! |
దర్శనము అయ్యాక గంటలు కొడుతున్న భక్తులు |
నేనైతే ఈ సారి మేడారం వెళ్ళాను. సామాన్యంగా చిన్నా మేడారం అని పిలువబడే ఆగ్రంపాడుకు
జాతర సమయములోనే వెళ్తాను. కాని మూడువారలముందే
మేడారం వెళ్ళాను. అయిన గద్దెల దగ్గర తోపులాట
తక్కువేమి లేదు. ఎలాగో మొక్కుకొని బైటపడ్డాను.
దర్శనము తర్వాత అలసిపోయి కూర్చున్న పెద్దమనిషి
చాలా మందికి జాతర సమయములో ఇదే పరిస్తితి వుంటుంది
ఎత్తు బంగారం సమర్పించటానికి తులాభారం |
ఈ ఏడు సమ్మక్క జాతర ఈ నెల ఫిబ్రవరి 21-25 వరకు వుంటుంది.
జాతరలో గాజులు కుంకుమ అమ్మే షాపులు ఎన్నో |
డిగ్రీ చదువుకున్నడు. ఉద్యోగము రావట్లేదు పొట్టకూటికి ఇదొక విద్య |
16 ఏండ్ల బాపడు. పది పాస్సైయ్యాడు. పౌరోహిత్యం చేస్తాడు, పెళ్లిళ్లు చేస్తాడట జాతర సమయములో అటుఇటు తిరుగుతూ జ్యోతిష్యం కూడా చెపుతానన్నాడు |
జాతర సమయములో ఎంతోమంది ఆదివాసులు ఏవేవో మూలికలు అమ్ముతు జ్యోతిష్యం చెపుతూ కనబడుతరు |